8, 9, 10 విద్యార్థులకు నేటి నుంచి టీవీ పాఠాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్‌(విద్యా ఛానెల్‌) ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది.

Published : 24 Jan 2022 05:04 IST

ఉదయం 10 గంటల నుంచి ప్రసారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్‌(విద్యా ఛానెల్‌) ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) ఆదివారం రాత్రి పాఠాల కాలపట్టికను విడుదల చేసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలు ప్రసారం కానున్నాయి. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమంలో పాఠాలను ప్రసారం చేస్తున్నారు. ఒక్కో తరగతికి ఒక్కో మాధ్యమానికి రెండు తరగతులు ప్రసారమవుతాయి. ఒక్కో పాఠం 30 నిమిషాలపాటు ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా... ఈ నెల 24, 25, 27, 28 తేదీల్లో టీవీ పాఠాలు వస్తాయి. ఈ నెల 26న రిపబ్లిక్‌ దినోత్సం కాగా...ఈ నెల 29, 30 శని, ఆదివారాలు పాఠాలు ఉండవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని