మా పోరాటానికి మద్దతివ్వండి

బదిలీలకు సంబంధించిన 317 జీవో ఉత్తర్వులను రద్దు చేయాలనే డిమాండ్‌తో చేసే తమ పోరాటానికి మద్దతు పలకాలని వివిధ రాజకీయ పార్టీలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) కోరింది.

Published : 25 Jan 2022 05:58 IST

రాజకీయ పార్టీలను కోరిన ఉపాధ్యాయులు

ఈనాడు, హైదరాబాద్‌: బదిలీలకు సంబంధించిన 317 జీవో ఉత్తర్వులను రద్దు చేయాలనే డిమాండ్‌తో చేసే తమ పోరాటానికి మద్దతు పలకాలని వివిధ రాజకీయ పార్టీలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) కోరింది. ఈ మేరకు యూఎస్‌పీసీ నేతలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు కె.రమ, కె.గోవర్ధన్‌, సీపీఎం, తెజస నాయకులను కలిశారు. వారు తమ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. ఈ నెల 29న కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు, ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాకు మద్దతు పలకడంతో పాటు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినట్లు స్టీరింగ్‌ కమిటీ నేతలు పేర్కొన్నారు.


స్పౌస్‌లకు బదిలీల్లో పాయింట్లు ఇవ్వొద్దు

భార్యాభర్తల విభాగంలో ఒక జిల్లాకు వెళ్లాలని ప్రభుత్వం కోరితే వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అందువల్ల ఇక నుంచి బదిలీలు జరిగినప్పుడు వారికి ప్రత్యేకంగా పాయింట్లు ఇవ్వవద్దని నాన్‌ స్పౌస్‌ టీచర్స్‌ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోకల శేఖర్‌, ప్రధాన కార్యదర్శి ఎం.సక్కుబాయి సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని