నివాస సముదాయాల వివరాలు అందించాలి: పురపాలక శాఖ

తెలంగాణలోని నగరపాలక సంస్థలు (జీహెచ్‌ఎంసీ మినహా), పురపాలక సంఘాల పరిధిలోని పురపాలక క్వార్టర్లు, నివాస, వాణిజ్య సముదాయాల లీజుల వివరాలను అందజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పురపాలక కమిషనర్లను ఆదేశించారు.

Published : 27 Jan 2022 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని నగరపాలక సంస్థలు (జీహెచ్‌ఎంసీ మినహా), పురపాలక సంఘాల పరిధిలోని పురపాలక క్వార్టర్లు, నివాస, వాణిజ్య సముదాయాల లీజుల వివరాలను అందజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ పురపాలక కమిషనర్లను ఆదేశించారు. పురపాలక క్వార్టర్లలో లీజుల ద్వారా ప్రస్తుత ఆక్రమణలో ఉన్నవారికే పురపాలక శాఖ నిర్ణయించిన మొత్తానికి శాశ్వత హక్కులు కల్పించేలా చర్యల్లో భాగంగా వివరాలను అందించాలని పేర్కొన్నారు. మంత్రిమండలి ఉప సంఘం నిర్ణయం నేపథ్యంలో లీజుల వివరాలు అందించాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని