
రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల: తితిదే
తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేయనుంది. ఉచిత సర్వదర్శనం టికెట్లను ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం లేదా 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.