గ్రాసానికీ తిప్పలే.. పశువులకూ వలస తప్పలే!

ఇదేంటి ఆలమందలన్నీ ఇలా ఒకే బాటన సాగిపోతున్నాయి..? ఎక్కడికబ్బా.. ఆశ్చర్యంగా ఉందే.. అనుకునేరు.. పశుగ్రాసం కొరతే ఇలా వందలాది ఆవులను, ఎడ్లను, దూడలను వలస పోయేలా చేస్తోంది. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం కాశరాజుపల్లికి చెందిన

Published : 27 Jan 2022 05:08 IST

ఇదేంటి ఆలమందలన్నీ ఇలా ఒకే బాటన సాగిపోతున్నాయి..? ఎక్కడికబ్బా.. ఆశ్చర్యంగా ఉందే.. అనుకునేరు.. పశుగ్రాసం కొరతే ఇలా వందలాది ఆవులను, ఎడ్లను, దూడలను వలస పోయేలా చేస్తోంది. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం కాశరాజుపల్లికి చెందిన అయిదుగురు తమ పశువులను సాధారణంగా వర్షాకాలంలో మద్దిమడుగు, శ్రీశైలం నల్లమల కనుమల్లో మేపుతుంటారు. ఆ ప్రాంతంలో గడ్డి కొరత తలెత్తటంతో సుమారు 600 ఆవులను నాంపల్లి మండల కేంద్రం, పరిసర ప్రాంతాల్లోని పత్తి చేలల్లో మేపేందుకు తీసుకొచ్చారు. అవి బుధవారం  బారులుగా సాగుతుండగా ఆ చిత్రాన్ని న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది. వేసవి ముగిసే దాకా చుట్టుపక్కల మండలాల్లో మందను మేపి వానాకాలం వచ్చేసరికి నల్లమలకు చేరుకుంటామని కాపరులు తెలిపారు.

- న్యూస్‌టుడే, నాంపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు