‘రక్షణ’ కోతి.. భక్షణే రీతి..!

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా ఉంది వీరి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం గౌరెల్లిలో కోతులు బెడద ఎక్కువయిందని స్థానికులు కొన్నేళ్ల కిందట రెండు కొండముచ్చులను తెచ్చారు. ఇప్పుడు

Published : 28 Jan 2022 04:42 IST

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా ఉంది వీరి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం గౌరెల్లిలో కోతులు బెడద ఎక్కువయిందని స్థానికులు కొన్నేళ్ల కిందట రెండు కొండముచ్చులను తెచ్చారు. ఇప్పుడు వాటి సంతతి కోతులను దాటిపోవడంతో రైతులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. ఇక్కడ ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తారు. కోతకు వచ్చే సమయంలో కొండముచ్చులు మందలుగా చేలల్లో పడి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని