చిన్న విమానాల ప్రణాళికైనా ఇవ్వండి

ప్రాంతీయ విమానాశ్రయాల ప్రణాళికలను త్వరగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు(ఏఏఐకి)  లేఖ రాసింది. ఇప్పటికే పలు దఫాలు లేఖ రాసినట్లు ఆ లేఖలో పేర్కొంది. ఏటీఆర్‌ విమానాలు కాకపోయినా

Published : 28 Jan 2022 04:44 IST

ప్రాంతీయ విమానాశ్రయాలపై ఏఏఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ విమానాశ్రయాల ప్రణాళికలను త్వరగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాకు(ఏఏఐకి)  లేఖ రాసింది. ఇప్పటికే పలు దఫాలు లేఖ రాసినట్లు ఆ లేఖలో పేర్కొంది. ఏటీఆర్‌ విమానాలు కాకపోయినా చిన్నవి నడిపేందుకు వీలుగా నివేదికలు ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలోని ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం-భద్రాచలంలలో  తలపెట్టింది. అధ్యయన బాధ్యతలు ఏఏఐకి అప్పగించింది. 2019లో క్షేత్రస్థాయిలో ఏఏఐ అధికారుల బృందం పరిశీలించి ఆరు ప్రాంతాల్లో నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం తెలిసింది. ఏటీఆర్‌-72, క్యూ-400 తరహా విమానాలను నడపవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడాదిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. ఆ తర్వాత ముందడుగు పడలేదు. తొలిదశలో కనీసం 20 సీట్ల చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నివేదిక సిద్ధం చేయాలని ఏఏఐ ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ లేఖ రాశారు. ‘

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని