బంతి విరిసె.. రైతు మోము మురిసె

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో నరిగె అయిలయ్య అనే రైతు రెండు ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. ఈ పూలకు మార్కెట్‌లో గిరాకీ ఉండడంతో.. వ్యాపారులు, స్థానికులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

Published : 28 Jan 2022 04:46 IST

రంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో నరిగె అయిలయ్య అనే రైతు రెండు ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. ఈ పూలకు మార్కెట్‌లో గిరాకీ ఉండడంతో.. వ్యాపారులు, స్థానికులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. చేతిలో ఇమిడే డిజిటల్‌ తూకం యంత్రంతో తోటలోనే తాజా పూలను డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు తోట వద్దే రూ.40 వేల విలువైన సుమారు 5 క్వింటాళ్ల పూలు విక్రయించినట్లు రైతు తెలిపారు.

- ఈనాడు, వరంగల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని