నలుగురు తెరాస ఎమ్మెల్సీల ప్రమాణం

స్థానిక సంస్థల కోటాలో రెండోసారి ఎమ్మెల్సీలుగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌)లతో పాటు తొలిసారి ఎమ్మెల్సీలైన వంటేరు యాదవరెడ్డి (మెదక్‌), ఎల్‌.రమణ (కరీంనగర్‌)లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ కార్యాలయంలో ప్రొటెం ఛైర్మన్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రి వీరితో ప్రమాణం చేయించారు.

Published : 28 Jan 2022 04:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటాలో రెండోసారి ఎమ్మెల్సీలుగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌)లతో పాటు తొలిసారి ఎమ్మెల్సీలైన వంటేరు యాదవరెడ్డి (మెదక్‌), ఎల్‌.రమణ (కరీంనగర్‌)లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ కార్యాలయంలో ప్రొటెం ఛైర్మన్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రి వీరితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి,  హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కవితతో ఇద్దరు తెరాస జిల్లా అధ్యక్షుల భేటీ

నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల తెరాస అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు గురువారం  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని