
త్వరలో శ్రీవారి దర్శన టోకెన్లు ఆఫ్‌లైన్‌లో: తితిదే ఛైర్మన్
తిరుమల, న్యూస్‌టుడే: సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా త్వరలోనే ఆఫ్‌లైన్ విధానంలో దర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు సంబంధించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు శనివారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ పేర్కొన్నారు. ఫిబ్రవరికి సంబంధించి రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో శుక్రవారం విడుదల చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.