
పుడమి రంగులో పురుగు!
వీపుపై కళ్లు, నోరు, ముక్కును పోలిన నల్లటి మచ్చలు.. వింతగొలిపేలా నేలలో కలిసిపోయే వర్ణంలో కనిపిస్తున్న ఈ కీటకాన్ని చూశారా.. ఇది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో శుక్రవారం స్థానికులను ఆకర్షించింది. ఎక్కడ నుంచో ఎగురుకుంటూ వచ్చిందని, 2 సెం.మీ. పొడవు ఉందని వారు ‘న్యూస్‌టుడే’కు వివరించారు. దీన్ని వైట్‌షీల్డ్ బగ్ అంటారని.. టేకు, మునగ చెట్లపై అరుదుగా కనిపిస్తుందని వరంగల్‌లోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కిషోర్ తెలిపారు.
- న్యూస్‌టుడే, గీసుకొండ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.