‘మెస్రం’ ఒకేమాట.. ‘నాగోబా’ అభివృద్ధి బాట

ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని మెస్రం వంశస్థులు అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఈ ఆలయాన్ని అనాదిగా మెస్రం వంశస్థులు విరాళాలు

Published : 29 Jan 2022 04:23 IST

దివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని మెస్రం వంశస్థులు అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఈ ఆలయాన్ని అనాదిగా మెస్రం వంశస్థులు విరాళాలు సేకరిస్తూ ఆధునికీకరిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం చిన్న గుడిసెలో మొదలై.. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని దినదినాభివృద్ధి చెందుతున్న వైనం ఆదివాసీలకు తమ సంస్కృతి, సంప్రదాయాలపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. 1942లో దట్టమైన అడవిలో ఓ చిన్న గుడిసెలో ఉన్న ఆలయాన్ని 1955లో ఆలయ పీఠాధిపతి మెస్రం చిత్రు పటేల్‌ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి నూతనంగా నిర్మించుకున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరగుతుండడంతో 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. గుడి ప్రభుత్వ నిధులతో కట్టినా గర్భగుడిని సొంత నిధులతో నిర్మించుకోవాలని తలచిన మెస్రం వంశస్థులు ప్రతి ఇంటికి ఏడాదికి రూ.5 వేలు, ప్రభుత్వ ఉద్యోగి రూ.10 వేలు ఇచ్చేందుకు తీర్మానించారు. ఈ రకంగా వారు రూ.4.50 కోట్లు సేకరించారు. మొత్తం రూ.5 కోట్లతో జరుగుతున్న పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. జనవరి 31న నాగోబా జాతర ప్రారంభం కానుంది.

- న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని