కేంద్ర లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు

‘ధాన్యం సేకరణలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అద]నంగా 1.31 లక్షల మెట్రిక్‌ టన్నులను ఈ సీజనులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి

Published : 29 Jan 2022 04:28 IST

పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ‘ధాన్యం సేకరణలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా అద]నంగా 1.31 లక్షల మెట్రిక్‌ టన్నులను ఈ సీజనులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా 593 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఒక్క తెలంగాణలోనే 70 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నాం. గడిచిన వానాకాలంలో కన్నా ప్రస్తుత సీజనులో 21.21 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా సేకరించాం. త్వరలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కానుంది. పరిమిత సంఖ్యలోని కొనుగోలు కేంద్రాలకు చాలా తక్కువ మొత్తంలో ధాన్యం విక్రయానికి వస్తోంది. చివరి గింజ వరకు కొనాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఇప్పటివరకు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రూ. 13,690 కోట్లను రైతులకు చెల్లించాం. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో తేమకు సంబంధించి చిన్నచిన్న సమస్యలు వచ్చాయి’ అని మంత్రి కమలాకర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు