ఖిలాలో విరిసిన హరితవనం

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే ప్రక్రియలు దాదాపు ఫలవంతం అవుతున్నాయి. ప్రత్యేకించి తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచే మియావాకి విధానం చక్కని ఫలితాలను అందిస్తోంది.. అదే పంథాను అనుసరిస్తూ

Published : 29 Jan 2022 04:29 IST

మూడున్నరేళ్లలోనే ‘చిట్టడవి’ రూపం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే ప్రక్రియలు దాదాపు ఫలవంతం అవుతున్నాయి. ప్రత్యేకించి తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచే మియావాకి విధానం చక్కని ఫలితాలను అందిస్తోంది.. అదే పంథాను అనుసరిస్తూ వరంగల్‌ జిల్లాలోని చారిత్రక ఖిలా వరంగల్‌ కోట, స్థానిక గుండు చెరువు పరిసరాలు.. రెండూ పచ్చలహారాన్ని తలపిస్తున్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) డెన్స్‌, అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ ప్రాజెక్టుల పేరుతో పెంచుతోన్న పచ్చదనం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

* ‘కుడా’, జీడబ్ల్యూఎంసీ భాగస్వామ్యంతో మియావాకి విధానంలో అభివృద్ధిపరచిన పచ్చదనంపై ఓ వీడియోను అధికారులు శుక్రవారం ట్విటర్‌లో పోస్టు చేయగా.. పురపాలక మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ తదితరుల నుంచి అభినందనలు లభించాయి.  

*  2019 జూన్‌లో ఒక ఎకరంలో మియావాకి పద్ధతిలో 10వేల మొక్కలు పెంచేలా ‘కుడా’ డెన్స్‌ (దట్టం) పేరిట ప్రాజెక్టు చేపట్టారు. మూడున్నరేళ్ల తర్వాత మొక్కలన్నీ పచ్చటి చెట్లుగా మారాయి. ప్రస్తుతం చిట్టడవిని తలపిస్తున్నాయి. ‘కుడా’ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ పేరుతో గుండు చెరువు వద్ద మరో అయిదెకరాల్లో 50వేల మొక్కలు పెంచేందుకు, వాటిని మూడేళ్ల పాటు సంరక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. చెరువు చుట్టూ సుమారు 30 ఎకరాలతో పాటు మధ్యకోట, శివాలయం స్థలాలనూ అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని