MK Stalin:తెలంగాణ పథకాలను తమిళనాడులోనూ అమలు చేస్తాం: స్టాలిన్‌

తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం శనివారం చెన్నైలో జరిగింది. కోటపాటి నర్సింహనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసినట్లు నర్సింహనాయుడు తెలిపారు.

Updated : 30 Jan 2022 07:21 IST

ఈనాడు, నిజామాబాద్‌: తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం శనివారం చెన్నైలో జరిగింది. కోటపాటి నర్సింహనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసినట్లు నర్సింహనాయుడు తెలిపారు. సమావేశంలో పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు పి.కె.దైవ శిగామణి, రాష్ట్రీయ కిసాన్‌ సంఘ్‌ కర్ణాటక శాఖ అధ్యక్షుడు శాంతకుమార్‌, కేరళ శాఖ అధ్యక్షుడు జాన్‌, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ గౌండర్‌, పుదుచ్చేరి వ్యవసాయ సంఘం అధ్యక్షులు నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని