RBI: ఏపీ రాజధాని ఎక్కడో నిర్ణయించాకే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం ఎక్కడో నిర్ణయించాకే తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు

Updated : 01 Feb 2022 08:09 IST

వినతిపై రిజర్వు బ్యాంక్‌ స్పందన

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం ఎక్కడో నిర్ణయించాకే తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న ఆర్‌బీఐకి లేఖ రాశారు. దానిపై ఆర్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఎం.కె.సుభాశ్రీ స్పందిస్తూ వీరాంజనేయులుకు సోమవారం లేఖ పంపారు. నగదు నిల్వలు, సరఫరాకు సంబంధించిన పెట్టెల విషయంపైనా సుభాశ్రీ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, భద్రత కమిటీల సమావేశాల్లోనూ కరెన్సీ పెట్టెల కొరతపై తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ నిర్వహణకు సంబంధించి తాము రాష్ట్ర పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని