TSRTC: ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు..

ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై టీఎస్‌ఆర్టీసీ మళ్లీ దృష్టిపెట్టింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు హైదరాబాద్‌ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం

Updated : 04 Feb 2022 07:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై టీఎస్‌ఆర్టీసీ మళ్లీ దృష్టిపెట్టింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు హైదరాబాద్‌ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత దసరా, సంక్రాంతి సమయాల్లో నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయని ఆర్టీసీ.. ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో  రూ.75-100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.

జనవరిలో భారీగా తగ్గిన ఆదాయం

గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో ఆ మొత్తం రూ.287.07 కోట్లకే పరిమితమైంది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది. గత డిసెంబరు ఆదాయం రూ.352.67 కోట్లతో పోల్చినా జనవరిలో రూ.65.55 కోట్ల మేర  తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని