వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగŸంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Updated : 10 Feb 2022 05:49 IST

ఉన్నతాధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్‌కే భవన్‌ నుంచి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను అందించడానికి సీఎం కేసీఆర్‌ జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ‘‘మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే ఏడాది నుంచి వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణ పనుల వేగవంతానికి ప్రతి వైద్య కళాశాలకు ఒక ఇంజినీరింగ్‌ అధికారిని నియమించాలి. నిర్మాణాలు పూర్తయిన వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని పేర్కొన్నారు. ఈ సమీక్షలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts