అవయవదానానికి జగపతిబాబు సమ్మతి

సినీనటుడు జగపతిబాబు శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అవయవదానానికి అంగీకరించారు. తన మరణాంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. కిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో

Published : 12 Feb 2022 06:00 IST

వంద మంది అభిమానులు  సైతం..

ఈనాడు, హైదరాబాద్‌: సినీనటుడు జగపతిబాబు శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని అవయవదానానికి అంగీకరించారు. తన మరణాంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. కిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణపత్రంపై సంతకం చేసి ఛైర్మన్‌ డాక్టర్‌ భాస్కరరావుకు అందించారు. 100 మంది అభిమానులు సైతం జగపతిబాబు బాటలో నడిచారు. తమ అభిమాననటుడు మాదిరి తామూ అవయవదానానికి సిద్ధమంటూ ప్రమాణ పత్రంపై సంతకం చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ.. సమయానికి అవయవాలు లభించక ఎందరో చనిపోతున్నారని తెలిపారు. అవయవదానంపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. తమకు అయినవాళ్ల ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. బాధను దిగమింగుకుని మరికొందరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకు రావడం గొప్ప నిర్ణయమని కిమ్స్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఈ సందర్భంగా గతంలో అవయవదానం చేసిన పలువురిని ఘనంగా సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని