Telangana News: పోలీసు శాఖలో 17 వేల కొలువులు ఖాళీ!

రాష్ట్ర పోలీసు శాఖలో 17 వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలోనూ ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా అన్ని శాఖలతోపాటు పోలీసు ఉద్యోగాల

Updated : 16 Feb 2022 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో 17 వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలోనూ ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా అన్ని శాఖలతోపాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖలో దాదాపు 16 వేల కానిస్టేబుల్‌, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు లెక్కగట్టినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వాస్తవానికి గతేడాదే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావించినా.. కొత్త జోన్లు, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక అడ్డంకుల కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాల అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు నియామక మండలి సిద్ధమైంది.  ఈ సారి కొత్త జోన్లు, జిల్లాల వారీగా నియామకాలను చేపట్టనుంది. తప్పులు, సమస్యలకు తావులేకుండా అభ్యర్థులు ఫోన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని