NTR Trust: మార్చి 20న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రతిభాపరీక్ష

ప్రతిభావంతులైన ఇంటర్మీడియెట్‌ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు మార్చి 20న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపిన

Updated : 17 Feb 2022 08:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిభావంతులైన ఇంటర్మీడియెట్‌ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు మార్చి 20న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపిన 25 మంది బాలికలకు కలిపి రూ.34 లక్షల వరకూ స్కాలర్‌షిప్‌లు ఇస్తామన్నారు. మొదటి 10 ర్యాంకులు సాధించిన బాలికలకు నెలకు రూ.5 వేల చొప్పున, 11 నుంచి 25వ ర్యాంకు పొందిన వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల డిగ్రీ కళాశాలలో చదివినంత కాలం అందిస్తామని వివరించారు. విద్యార్థినులు ఈ నెల 17 నుంచి మార్చి 15 వరకు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని