Andhra News: ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు స్మార్ట్‌ఫోన్లు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలులో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు 56,984 స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ద్వారా వీటిని సేకరిస్తారు. ఈ మేరకు మహిళా

Updated : 20 Feb 2022 08:47 IST

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలులో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు 56,984 స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ద్వారా వీటిని సేకరిస్తారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌)లో రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 560 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులను అంగన్‌వాడీ కార్యకర్తలతో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే నియామక కమిటీ ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని