అడుగంటిన శ్రీశైలం జలాశయం.. 804 అడుగులకు పడిపోయిన నీటిమట్టం

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అడుగంటుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 804.60 అడుగులకు పడిపోయింది. 215.80 టీఎంసీల నీటి సామర్థ్యం 31.35 టీఎంసీలకు తగ్గింది. 2021-22లో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి 1,118 టీఎంసీల నీరు వచ్చింది. నాగార్జునసాగర్‌, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,086 టీఎంసీలను తరలించారు. ఎడమగట్టు కేంద్రం నుంచి 386 టీఎంసీలు, కుడిగట్టు కేంద్రం నుంచి 252 టీఎంసీలను కేవలం విద్యుదుత్పత్తికి వినియోగించి కిందికి వదిలారు.

Updated : 21 Feb 2022 07:43 IST

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అడుగంటుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 804.60 అడుగులకు పడిపోయింది. 215.80 టీఎంసీల నీటి సామర్థ్యం 31.35 టీఎంసీలకు తగ్గింది. 2021-22లో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి 1,118 టీఎంసీల నీరు వచ్చింది. నాగార్జునసాగర్‌, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,086 టీఎంసీలను తరలించారు. ఎడమగట్టు కేంద్రం నుంచి 386 టీఎంసీలు, కుడిగట్టు కేంద్రం నుంచి 252 టీఎంసీలను కేవలం విద్యుదుత్పత్తికి వినియోగించి కిందికి వదిలారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో పాతాళగంగ చివరి మెట్లు దాటి దిగువకు నీరుంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా జల్లు స్నానాలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు శ్రీశైలం ఈవో లవన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని