Telangana News: ఖాతాలోకి రూ.రెండు కోట్లు.. తిరిగిచ్చేసిన వైరా వాసి

రూ.లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఓ వ్యక్తి ఖాతాలో రూ.2 కోట్లు జమయ్యాయి. తొలుత ఆశ్చర్యానికి గురైన ఆయన తేరుకుని వివరాలు ఆరా తీసి ఆ సొమ్మును బదిలీ చేశారు.

Updated : 23 Feb 2022 06:57 IST

వైరా, న్యూస్‌టుడే: రూ.లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఓ వ్యక్తి ఖాతాలో రూ.2 కోట్లు జమయ్యాయి. తొలుత ఆశ్చర్యానికి గురైన ఆయన తేరుకుని వివరాలు ఆరా తీసి ఆ సొమ్మును బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన గంధం వెంకటేశ్వర్లు వ్యాపారి. వైరాలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా  భవన సముదాయం ఉంది. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ఓ సంస్థ వారు అందులో బ్రాంచి ఏర్పాటు చేశారు. యజమాని వెంకటేశ్వర్లు ఖాతాలో నెలనెలా అద్దెను జమ చేస్తుంటారు. ఈ నెల 19న ఆయన ఖాతాలో ఆ సంస్థ నుంచి రూ.2 కోట్ల నగదు జమైందంటూ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. బ్యాంకులో ఆరా తీయగా అధికారులు నిజమేనని ధ్రువీకరించారు. వెంటనే సమాచారం ఇవ్వగా.. క్లర్కు పొరపాటుగా వేరొకరికి పంపాల్సిన మొత్తాన్ని వెంకటేశ్వర్లు ఖాతాకు జమ చేసినట్టు ఆ సంస్థ గుర్తించింది. మంగళవారం ఆయన ఆ మొత్తాన్ని ఆ సంస్థ ఖాతాకు మళ్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని