Telangana News: పెండింగ్‌ చలానాల రాయితీ ఖరారు.. మార్చి1 నుంచి 31వరకు అవకాశం

రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లించని వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించిన భారీ రాయితీ మార్చి 1 నుంచి అమలు కానుంది. పెండింగ్‌ చలానాలున్న వాహనదారులు ఆన్‌లైన్‌ లోక్‌అదాలత్‌

Updated : 26 Feb 2022 14:36 IST

ఆన్‌లైన్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా చెల్లించాలి  

ఈనాడు, హైదరాబాద్‌: రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లించని వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించిన భారీ రాయితీ మార్చి 1 నుంచి అమలు కానుంది. పెండింగ్‌ చలానాలున్న వాహనదారులు ఆన్‌లైన్‌ లోక్‌అదాలత్‌ ద్వారా రాయితీలను ఉపయోగించుకుని మిగిలిన జరిమానా మొత్తాన్ని చెల్లించాలి. మార్చి1 నుంచి 31 వరకు రాయితీ అమల్లో ఉంటుంది.. 90శాతం మంది వాహనదారులకు జరిమానాలు భారంగా మారడం, బకాయిలు రూ.1250 కోట్లకుపైగా ఉండడంతో వీటిని కొలిక్కి తెచ్చేందుకు పోలీస్‌ అధికారులు రాయితీల నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1నుంచి జరిమానాలను ట్రాఫిక్‌ పోలీస్‌, తెలంగాణ పోలీస్‌ ఈ-చలాన్‌ వెబ్‌సైట్ల ద్వారా చెల్లించవచ్చు. దీంతోపాటు ట్రాఫిక్‌ కంట్రోల్‌రూంలోని ట్రాఫిక్‌ కాంపౌండింగ్‌ బూత్‌ ద్వారా డబ్బు కట్టేందుకు అవకాశం కల్పించారు. వాహనదారులు తమ పెండింగ్‌ చలానాలను చెల్లించేందుకు వీలుగా పోలీస్‌ ఉన్నతాధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి ఆ వెబ్‌సైట్‌లో అదనంగా ఆన్‌లైన్‌ లోక్‌ అదాలత్‌ ఐచ్ఛికాంశం చేరనుంది. పెండింగ్‌ చలానాలు చెల్లించేవారు ఆన్‌లైన్‌ లోక్‌అదాలత్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే జరిమానాల మొత్తం రాయితీ పోను కట్టాల్సిన సొమ్ము తెరపై కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని