Medaram Jathara: ఈసారి మేడారం ఆదాయం ఎంతంటే..

మేడారం వనదేవతలకు భక్తులు సమర్పించిన కానుకల విలువ సోమవారం నాటికి రూ.10 కోట్లు దాటింది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో....

Updated : 01 Mar 2022 07:51 IST

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: మేడారం వనదేవతలకు భక్తులు సమర్పించిన కానుకల విలువ సోమవారం నాటికి రూ.10 కోట్లు దాటింది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో కానుకల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 497 హుండీలకు 450 హుండీల లెక్కింపు పూర్తికాగా రూ10,00,63,980 ఆదాయం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ విలువ చివరకు అంచనావేయనున్నారు. నాణేల లెక్కింపు తర్వాత పూర్తి వివరాలను దేవాదాయ శాఖ అధికారులు వెల్లడిస్తారు. కాగా గత జాతరలో మొత్తం ఆదాయం రూ.11,64,00,000 సమకూరిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని