Telangana News: చలానా రాయితీలు నేటి నుంచే అమలు

రాష్ట్రంలో రహదారి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించిన చలానాలను రాయితీ ద్వారా చెల్లించేందుకు పోలీసుశాఖ ఇచ్చిన అవకాశం మంగళవారం నుంచి అమలులోకి రానుంది.

Published : 01 Mar 2022 08:39 IST

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రహదారి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించిన చలానాలను రాయితీ ద్వారా చెల్లించేందుకు పోలీసుశాఖ ఇచ్చిన అవకాశం మంగళవారం నుంచి అమలులోకి రానుంది. మార్చి 31 వరకూ ఇది అమలులో ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేరంపై పోలీసులు జరిమానాలు విధించినా చాలామంది వాటిని చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బకాయిలు దాదాపు రూ.2300 కోట్లకు చేరాయి. దాంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు పోలీసుశాఖ భారీగా రాయితీలు ప్రకటించింది. చెల్లించాల్సిన జరిమానా మొత్తంలో ద్విచక్రవాహనాలు, ఆటోల యజమానులకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, ఇతర వాహనాలకు 50 శాతం రాయితీ ఉంటుంది. కరోనా నిబంధనల్లో భాగంగా మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించగా ఇందులో 90శాతం రాయితీ ప్రకటించింది. తెలంగాణ పోలీసు ఈ చలానా వెబ్‌సైట్‌తో పాటు ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ ద్వారా ఈ చెల్లింపులు జరపవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బకాయిలు చెల్లించాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని