Ukraine Crisis: కష్టాల్లోనూ పిల్లిని వదల్లేదు..

ఓ వైపు యుద్ధం.. ఎన్నో ప్రయాసలు. ఇంతటి కష్టకాలంలోనూ తాను ఇష్టంగా పెంచుకున్న పిల్లిని వదలలేదు ఆ విద్యార్థి. దాన్ని చంకనెత్తుకుని ఖండాలు దాటి స్వదేశానికి చేరుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండకు

Updated : 05 Mar 2022 09:12 IST

మార్జాలంతో స్వదేశం చేరుకున్న విద్యార్థి

ఓ వైపు యుద్ధం.. ఎన్నో ప్రయాసలు. ఇంతటి కష్టకాలంలోనూ తాను ఇష్టంగా పెంచుకున్న పిల్లిని వదలలేదు ఆ విద్యార్థి. దాన్ని చంకనెత్తుకుని ఖండాలు దాటి స్వదేశానికి చేరుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండకు చెందిన పూదూరు ప్రఖ్యాత్‌ ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో భారత్‌కు వెళ్లడమెలా అని మథనపడ్డారు. అతి కష్టం మీద సరిహద్దు దాటి రొమేనియా చేరుకున్నారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో ప్రయాణించి శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంత శ్రమ పడినా, సాంజ అనే తన పెంపుడు మార్జాలాన్ని మరిచిపోకుండా, అపురూపంగా వెంట తెచ్చుకున్నారు. ఆ పిల్లిని తన కళాశాల అధ్యాపకురాలు బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రఖ్యాత్‌ తండ్రి గతంలో అనారోగ్యంతో చనిపోగా తల్లి మణెమ్మ స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్నారు.  

- న్యూస్‌టుడే, కల్ల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని