KTR: అక్కాచెల్లెళ్ల ఉన్నత విద్యకు కేటీఆర్‌ చేయూత

పేదకుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నత విద్యనభ్యసించడానికి మంత్రి కేటీఆర్‌ చేయూతనిచ్చారు. వారి కోర్సులు పూర్తయ్యేంతవరకు తాను సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి

Published : 07 Mar 2022 08:34 IST

చదువు పూర్తయ్యేంతవరకు ఖర్చు భరిస్తానని భరోసా

ఈనాడు, హైదరాబాద్‌: పేదకుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నత విద్యనభ్యసించడానికి మంత్రి కేటీఆర్‌ చేయూతనిచ్చారు. వారి కోర్సులు పూర్తయ్యేంతవరకు తాను సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజమల్లు రోజువారి కూలీ. తన కాయకష్టంతో తన ఇద్దరు కూతుళ్లు కావేరి(21), శ్రావణి(18)లను చదివిస్తున్నారు. కావేరి ఇంటర్మీడియెట్‌లో 95 శాతం మార్కులు సాధించి... నీట్‌లోనూ ర్యాంకు పొంది సిద్దిపేటలోని సురభి వైద్య కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు పొందింది. శ్రావణి ఇంటర్‌లో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించి ఏపీలోని ఎన్‌ఐటీ తాడేెపల్లిగూడెంలో బీటెక్‌ సీటు సంపాదించింది. ఇద్దరికీ ఉచిత సీట్లు వచ్చినా ట్యూషన్‌, హాస్టల్‌, మెస్‌ ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ట్విటర్‌ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఇద్దరికీ మొదటి సంవత్సరానికయ్యే మొత్తం చెల్లించేందుకు చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కావేరి, శ్రావణిలు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని