Bhagwant Mann: పంజాబ్‌ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి

పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌మాన్‌ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక స్థానం లభించింది. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి అరిబండి వేణుప్రసాద్‌ను శనివారం నియమించారు.

Updated : 13 Mar 2022 07:35 IST

ఈటీవీ, ఖమ్మం, నేరేడుచర్ల, న్యూస్‌టుడే: పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌మాన్‌ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక స్థానం లభించింది. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి అరిబండి వేణుప్రసాద్‌ను శనివారం నియమించారు. వేణుప్రసాద్‌ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న వాసి. ఆయన 1991లో ఐఏఎస్‌గా ఎంపికై పంజాబ్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు. ఫరీద్‌కోట్‌, జలంధర్‌ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ సీఎండీగా పనిచేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ఇంటర్‌, బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ ఎంఎస్సీ పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని