NEET: పీజీ వైద్యవిద్య ప్రవేశాలకు నీట్‌ కటాఫ్‌ మార్కుల తగ్గింపు

నీట్‌ 2021 పీజీ వైద్యవిద్య కటాఫ్‌ మార్కులను 15 పర్సంటైల్‌ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకొంది. దీంతో జనరల్‌ అభ్యర్థులకు 35 పర్సంటైల్‌

Updated : 16 Mar 2022 07:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ 2021 పీజీ వైద్యవిద్య కటాఫ్‌ మార్కులను 15 పర్సంటైల్‌ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకొంది. దీంతో జనరల్‌ అభ్యర్థులకు 35 పర్సంటైల్‌ 247 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 25 పర్సంటైల్‌ 210 మార్కులు, దివ్యాంగులకు 30 పర్సంటైల్‌ 229 మార్కులుగా నిర్ణయించింది. కటాఫ్‌ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు కన్వీనర్‌ కోటాలో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం మరోసారి ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధి కళాశాలలతో పాటు నిమ్స్‌లోనూ పీజీ వైద్యవిద్యను అభ్యసించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 16న ఉదయం 8 నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని