Telangana News: ప్రభుత్వ ప్లాట్ల వేలం ద్వారా భారీగా ఆదాయం.. అత్యధికంగా ఎక్కడంటే..

రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ సహా మరో ఏడు జిల్లాల్లో ప్రభుత్వ ప్లాట్ల (నివాస స్థలాలు) వేలం ద్వారా రూ.567 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1356 ప్లాట్లను వేలం వేయగా 1227

Published : 18 Mar 2022 08:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ సహా మరో ఏడు జిల్లాల్లో ప్రభుత్వ ప్లాట్ల (నివాస స్థలాలు) వేలం ద్వారా రూ.567 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1356 ప్లాట్లను వేలం వేయగా 1227 ప్లాట్లు  విక్రయమయ్యాయి. ప్లాట్ల వేలం ద్వారా రూ.399 కోట్ల రాబడిని అంచనా వేయగా రూ.567కోట్లకు అమ్ముడయ్యాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, తొర్రూరు రెండు చోట్ల 297 ప్లాట్లు, జిల్లాల్లో మరో 930 ప్లాట్లను వేలం వేశారు. రాష్ట్రంలోని 3.31 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వం విక్రయించింది. బహదూర్‌పల్లి ప్లాట్ల వేలం ద్వారా రూ.140 కోట్లు పైగా, తొర్రూరు ప్లాట్ల ద్వారా రూ.194 కోట్లపైగా రాబడి వచ్చింది. జిల్లాల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో రూ.90 కోట్లు, గద్వాలలో రూ.51 కోట్లు, జిల్లా కేంద్రం కామారెడ్డిలో రూ.34 కోట్లు, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో రూ.31 కోట్లు రాగా పెద్దపల్లిలో రూ.19 కోట్లు, ఆదిలాబాద్‌లోని మావలలో రూ.3.4 కోట్లు రాగా వికారాబాద్‌ యాలాల్‌లో రూ.90లక్షల రాబడి వచ్చింది. ఈ మేరకు వివరాలను గురువారం హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని