Telangana News: ప్రైవేటులోనూ ఉచిత టీబీ పరీక్షలు, వైద్యం

ప్రైవేటు రంగంలోనూ ఇకపై ఉచితంగా క్షయ పరీక్షలతో పాటు వైద్యం అందించనున్నట్లు తెలంగాణ టీబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డా.రాజేశం తెలిపారు. ఈ నెల 24న అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఐబీ భాగస్వామ్యంతో

Updated : 23 Mar 2022 08:56 IST

రాష్ట్ర టీబీ విభాగం జేడీ డా.రాజేశం వెల్లడి

రాంనగర్‌, న్యూస్‌టుడే : ప్రైవేటు రంగంలోనూ ఇకపై ఉచితంగా క్షయ పరీక్షలతో పాటు వైద్యం అందించనున్నట్లు తెలంగాణ టీబీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ డా.రాజేశం తెలిపారు. ఈ నెల 24న అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఐబీ భాగస్వామ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. 2025 నాటికి రాష్ట్రంలో క్షయ నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నూతన కాట్రిడ్జ్‌ బేస్డ్‌ న్యూక్లియర్‌ యాసిడ్‌ యాంప్లిఫికేషన్‌ టెస్టింగ్‌ (సీబీఎన్‌ఏఏటీ) యంత్రాలను నారాయణపేట మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో సమకూర్చామన్నారు. వీటి ద్వారా గంటలో పరీక్ష ఫలితం వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని అపెక్స్‌ టీబీ ఆసుపత్రిగా గుర్తించినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు సహాయం కోసం 1800 116666 నంబరును సంప్రదించాలని సూచించారు. జాతీయ స్థాయిలో క్షయ నిర్మూలనలో ముందున్న నిజామాబాద్‌ జిల్లాకు ఈ నెల 24న దిల్లీలో కేంద్ర ప్రభుత్వం సిల్వర్‌ మెడల్‌ అందజేయనున్నట్లు తెలిపారు. పీఐబీ డైరెక్టర్‌ శ్రుతిపాటిల్‌ అధ్యక్షతన జరిగిన కార్యశాలలో సాంక్రమిక వ్యాధుల నిపుణురాలు డా.సి.సుమలత, ఐఈసీ అధికారి జితేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని