Telangana News: ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. తప్పని ఆర్థిక కష్టాలు..
నిరుపేద కుటుంబమైనా.. తమ పిల్లలిద్దరూ వైద్యులు కావాలని ఆ తండ్రి కలలు కన్నారు. అందుకు తన రక్తాన్ని ధారపోసి అయినా చదివించాలని తపన పడ్డారు. అయితే కరోనా ఆయనను
సాయానికి అన్నాచెల్లెళ్ల వేడుకోలు
గత ఏడాది కరోనాతో కన్నుమూసిన తండ్రి..
ఈనాడు, వరంగల్: నిరుపేద కుటుంబమైనా.. తమ పిల్లలిద్దరూ వైద్యులు కావాలని ఆ తండ్రి కలలు కన్నారు. అందుకు తన రక్తాన్ని ధారపోసి అయినా చదివించాలని తపన పడ్డారు. అయితే కరోనా ఆయనను బలి తీసుకుంది. అధైర్యపడకుండా పిల్లలు షేక్ సోయబ్, సానియాలు కష్టపడి చదవి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. అయితే ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తల్లితో కలిసి దాతల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సానియాకు కాకతీయ మెడికల్ కళాశాలలో సీటు రాగా, షేక్ షోయబ్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. తన పిల్లలను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది తల్లి జహీరా బేగం.
వీరి తండ్రి షేక్ షబ్బీర్ ములుగు జిల్లా కేంద్రంలో కంప్యూటర్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు. గతేడాది ఆయన కరోనాతో చనిపోగా.. సొంతిల్లు సైతం లేకపోవడంతో హనుమకొండ నగర పరిధిలో గోపాల్‌పూర్‌లోని తన పుట్టింట్లో తాత్కాలికంగా ఉంటున్నట్లు జహీరా బేగం తెలిపారు.
‘మమ్మలను వైద్యులను చేయాలని నాన్న తపన పడేవారు. తొలిసారి నీట్లో మంచి ర్యాంక్ రాకపోవడంతో గత ఏడాది మెరుగైన శిక్షణకు హైదరాబాద్ పంపారు. గత జూన్‌లో కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలిస్తే మా ఏకాగ్రత దెబ్బతింటుందని ఆ విషయాన్ని తెలియనీయలేదు. కొద్దిరోజులకే మహమ్మారి ఆయన్ను కబళించింది. ఈ విషయం తెలిసి తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. మమ్మల్ని డాక్టర్లుగా చూడాలన్న నాన్న ఆశయం గుర్తొచ్చి.. మనోధైర్యం కూడగట్టుకుని చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం’ అని సానియా, షోయబ్ వివరించారు. దాతలు స్పందించి తమ చదువులకు సహకరిస్తే వైద్యులుగా రాణిస్తామని విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!