రూ.9 వేల మార్కు దాటిన క్వింటా పసుపు

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో క్వింటాలు పసుపు ధర రూ.9 వేల మార్కు దాటింది. గురువారం గరిష్ఠ ధర రూ.9,011 పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. నమూనా ధర రూ.7,455గా నమోదైంది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో రూ.10 వేల

Published : 08 Apr 2022 05:29 IST

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో క్వింటాలు పసుపు ధర రూ.9 వేల మార్కు దాటింది. గురువారం గరిష్ఠ ధర రూ.9,011 పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. నమూనా ధర రూ.7,455గా నమోదైంది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో రూ.10 వేల సూచీ కనిపించడంతో పసుపు రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో పసుపు ధర మరింత పెరగొచ్చని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

మక్కలకు రికార్డు ధర

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: మక్కలకు రికార్డు ధర దక్కింది. మొక్కజొన్నకు ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1,860గా ఉంది. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో ఈనామ్‌ విధానంలో రూ.2,300 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. గంగదేవిపల్లి గ్రామానికి చెందిన బైకాని ఎర్రయ్య గురువారం తీసుకొచ్చిన 14 బస్తాల మక్కలను నలివెల సంపత్‌కుమార్‌ అడ్తి వ్యాపారి ద్వారా సదా ట్రేడర్‌ ఖరీదుదారు కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని