Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉంటోంది. పలు ప్రాంతాల్లో మండే ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షాలతో వాతావరణం చల్లబడి ఊరట చెందుతున్నారు. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు,

Updated : 18 Apr 2022 07:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉంటోంది. పలు ప్రాంతాల్లో మండే ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షాలతో వాతావరణం చల్లబడి ఊరట చెందుతున్నారు. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం పగలు హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం పగలు అత్యధికంగా చాప్రాలా(ఆదిలాబాద్‌ జిల్లా)లో 43.9 డిగ్రీలుంది. ఉష్ణోగ్రత ఈ స్థాయికి పెరగగడం ఈ నెలలో ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని