Telangana News: 24 నుంచి బడికెళ్లేది ఒక ఉపాధ్యాయుడే

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నా పదో తరగతి విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం ఆదేశాలు

Published : 21 Apr 2022 08:16 IST

పది విద్యార్థుల సన్నద్ధతకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నా పదో తరగతి విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం ఆదేశాలు జారీచేశారు. పంచాయతీరాజ్‌, ప్రభుత్వ, మోడల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు(టీఆర్‌ఈఐఎస్‌), ఎయిడెడ్‌ పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. పదో తరగతిలో ఒక సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అంటే రెండు సెక్షన్లుంటే ఇద్దరు వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం సెక్షన్లుంటే ఇద్దరు పాఠశాలలకు హాజరుకావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు