Telangana News: అత్తారింటికి... అవస్థల దారిలో!

గుట్టలపై, రాళ్లురప్పల మార్గాల్లో గిరిజనులు పడుతున్న రవాణా కష్టాలకు నిదర్శనం ఈ చిత్రం.ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం వాన్‌వట్‌ పంచాయతీ పరిధిలోని మాంగ్లి గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తాయి.

Published : 28 Apr 2022 09:23 IST

గుట్టలపై, రాళ్లురప్పల మార్గాల్లో గిరిజనులు పడుతున్న రవాణా కష్టాలకు నిదర్శనం ఈ చిత్రం. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం వాన్‌వట్‌ పంచాయతీ పరిధిలోని మాంగ్లి గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తాయి. ఆదిలాబాద్‌ నుంచి వాన్‌వట్‌ వరకు బీటీ రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గుట్టపైన, 4 కిలోమీటర్ల దూరంలోని మాంగ్లి గ్రామానికి వెళ్లడానికి రాళ్లబాటే శరణ్యం. బుధవారం మాంగ్లి గ్రామానికి చెందిన కోశేరావ్‌, గుడిహత్నూర్‌ మండలం నార్‌జీడిపల్లెకు చెందిన గంగాదేవి పెళ్లి జరిగింది. గుట్టపై ఉన్న మాంగ్లి గ్రామానికి వాహనాలు వెళ్లే వీలులేకపోవడంతో పెళ్లికుమార్తెను వాన్‌వట్‌ నుంచి ఎడ్లబండిపై ఇలా నలుగురు అతికష్టంగా తోస్తూ తీసుకెళ్లారు.

-ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని