Telangana News: బొత్సపై ట్విటర్‌లో బోగస్‌ సమాచారం

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ 15 నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించని కారణంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) ట్విటర్‌లో పేర్కొన్నట్లుగా

Updated : 01 May 2022 08:03 IST

దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ 15 నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించని కారణంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) ట్విటర్‌లో పేర్కొన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ట్వీట్‌ బోగస్‌ అని డిస్కం సీఎండీ  రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ పేరు మీద ఇలాంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని