Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు!

గాలుల్లో అస్థిరత కారణంగా మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated : 07 May 2022 07:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: గాలుల్లో అస్థిరత కారణంగా మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శాలిగౌరారం(నల్గొండ జిల్లా)లో 2.2, గంగారం(ఖమ్మం)లో 1.7, పెంట్లం(భద్రాద్రి కొత్తగూడెం)లో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం పగలు అత్యధికంగా జైనథ్‌(ఆదిలాబాద్‌ జిల్లా)లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట సైతం అత్యల్పంగా నిజామాబాద్‌లో 29.1 డిగ్రీలుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందిన ఎల అంజయ్య(51), హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడేనికి చెందిన మేడి సమ్మయ్య(48) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని