Telangana News: పేద కుటుంబం.. పెద్ద కష్టం!

బుడిబుడి నడకలతో చిన్నారులు ఇంట సందడి చేస్తుంటే కన్నవాళ్లు అనుభవించే సంతోషం మాటల్లో చెప్పలేం. ఈ పేద కుటుంబానికి ఆ అదృష్టం లేదు. ఒక ఆడపిల్ల తర్వాత పుట్టిన మరో ఆడపిల్ల, బాబు.. ఇద్దరిలోనూ ఎదుగుదల లోపించింది. మెడలు సరిగా నిలపలేరు. పాప పుట్టి నాలుగేళ్లయినా

Updated : 07 May 2022 08:15 IST

బుడిబుడి నడకలతో చిన్నారులు ఇంట సందడి చేస్తుంటే కన్నవాళ్లు అనుభవించే సంతోషం మాటల్లో చెప్పలేం. ఈ పేద కుటుంబానికి ఆ అదృష్టం లేదు. ఒక ఆడపిల్ల తర్వాత పుట్టిన మరో ఆడపిల్ల, బాబు.. ఇద్దరిలోనూ ఎదుగుదల లోపించింది. మెడలు సరిగా నిలపలేరు. పాప పుట్టి నాలుగేళ్లయినా చూడటానికి ఏడాది వయసున్నట్టుగానే కనిపిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యల వల్ల ఇలా జరుగుతోందని వైద్యులు చెప్పారని వారి నాయనమ్మ రాజీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం లచ్చునాయక్‌ తండాకు చెందిన వీరు.. ఈ చిన్నారుల కోసం ఉన్న కాస్త పొలాన్నీ తెగనమ్మి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను కలిసి వేడుకుందామని ఆ పిల్లల తల్లి సావిత్రి, నాయనమ్మ రాజీబాయి ఎర్రటి ఎండలో కలెక్టరేట్‌కు వచ్చారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతున్నారు. తమ బిడ్డలకు మెరుగైన చికిత్స అందేలా సహకరించాలని అందరినీ వీరు కోరుతున్నారు. సాయం చేయగోరేవారు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 96666 90513.

- ఈనాడు, సంగారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని