Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక వరకు గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితలద్రోణి ఏర్పడింది.

Published : 08 May 2022 08:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక వరకు గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితలద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు మధ్యాహ్నం పూట ఎండలో బయట తిరగవద్దని సూచించింది. శనివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జమ్మికుంట (కరీంనగర్‌ జిల్లా)లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని