Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను తీవ్రత తగ్గింది. ఇది గురువారం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలంగాణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో

Updated : 12 May 2022 07:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను తీవ్రత తగ్గింది. ఇది గురువారం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలంగాణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 82 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7, నీల్వాయిలో 2.2, శ్రీరంగాపూర్‌(వనపర్తి)లో 1.5, పెద్దకొత్తపల్లి(నాగర్‌కర్నూల్‌)లో 1.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  మరోవైపు బుధవారం మధ్యాహ్నం జైనథ్‌(ఆదిలాబాద్‌ జిల్లా)లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెద్దబెల్లాల్‌కు చెందిన ఉపాధి హామీ పథకం కూలీ జక్కుల కాంత(52) గ్రామ చెరువులో పూడికమట్టిని తొలగిస్తూ వడదెబ్బకు గురై మృతి చెందారు.

* వర్షాలతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాలపై కారుమబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. రెండు రోజుల క్రితంతో పోల్చితే హైదరాబాద్‌లో 10 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.

* వర్షాలు పడే అవకాశమున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద, పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిచే ప్రమాదముంది. ధాన్యం తడవకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గురువారం ధాన్యాన్ని ఆరబోయకుండా పరదాలు కప్పి ఉంచితే మేలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని