Telangana News: పది పరీక్షల్లో తెలుగుకు రెండు పేపర్లా!

10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాకముందే వాటికి హాజరవుతున్న విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ సందిగ్ధంలో పడేసింది. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

Updated : 14 May 2022 07:24 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాకముందే వాటికి హాజరవుతున్న విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ సందిగ్ధంలో పడేసింది. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. తీరా అందులోని పరీక్షల వివరాలను చూసి అందోళనకు గురవుతూ ఉపాధ్యాయులను ఆశ్రయిస్తున్నారు. ఈ సారి ఒక్క సైన్స్‌ పాఠ్యాంశానికే ఒకే రోజు రెండు పరీక్ష పేపర్లు పెడుతుండగా, మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్క పేపర్‌ను మాత్రమే పెడుతున్నారు. అయితే హాల్‌టికెట్లలో ఈ నెల 23న ప్రారంభమయ్యే తెలుగు పరీక్షకు మాత్రం పేపర్‌-1, పేపర్‌-2 ఉండటం చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. తెలుగు పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతున్నట్లు తెలుగు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

‘పది’ పరీక్షలకు పర్యవేక్షణ అధికారుల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను జిల్లా పర్యవేక్షణ అధికారులుగా విద్యాశాఖ నియమించింది. ఒక్కో అధికారికి ఒకటి నుంచి అయిదు జిల్లాల చొప్పున కేటాయించారు. వారు ప్రతిరోజూ పరీక్షలు జరిగిన తీరుపై నివేదికలు అందజేయాలి. ఈసారి పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు(సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ అధికారులు(డీవో) కూడా సెల్‌ఫోన్లు వినియోగించడానికి వీల్లేదని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. గతంలోనే ఇలాంటి నిబంధన ఉంది. అత్యవసరమైతే పోలీస్‌ కానిస్టేబుల్‌ వద్ద ఉన్న ఫోన్‌ను వాడుకోవాలని 2016లో ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు