Telangana News: పసికందును సాకలేను.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో ఏడు రోజుల పసికందును పోషించలేనని శనివారం ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక ఎస్సై సాయన్న, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సురేఖ

Updated : 15 May 2022 07:52 IST

మానసిక స్థితి సరిగా లేని తల్లి

రెంజల్, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో ఏడు రోజుల పసికందును పోషించలేనని శనివారం ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక ఎస్సై సాయన్న, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సురేఖ కథనం ప్రకారం.. రెంజల్‌కు చెందిన రేణుకకు నీలా గ్రామానికి చెందిన నగేశ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి ఈ నెల 7న పాప జన్మించింది. రేణుకకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. రేణుక ఇంటికి వెళ్లిన ఆశా కార్యకర్తలు పాపకు సరిగా పాలు పట్టడంలేదని గుర్తించి భర్తకు సమాచారమందించారు. దీంతో ఆయన వచ్చి పాపను తీసుకెళ్లారు. ఆయన కుటుంబీకులు వారించడంతో పాపను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తాను సాకలేనని చెప్పాడు. దీంతో పోలీసులు శిశువును తిరిగి తల్లి చెంతకు చేర్చారు. పసికందును అటు నగేశ్, ఇటు రేణుక కుటుంబ సభ్యులు వద్దంటుండడంతో ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు సురేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం శిశువు తల్లి వద్దే ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని