Weather Forecast: తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు

కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు అదనంగా పెరిగి ఎండల

Updated : 16 May 2022 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు అదనంగా పెరిగి ఎండల తీవ్రత అధికం కానుంది. ఆదివారం మధ్యాహ్నం అత్యధికంగా జైనథ్‌(ఆదిలాబాద్‌ జిల్లా)లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి పెరిగి ప్రజలు ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పగలు కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు సమీపంలో సోమవారం నైరుతి రుతుపవనాల కదలికలు మొదలవుతాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదివారం వడదెబ్బతో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడపాక గ్రామానికి చెందిన మహిళా రైతు కూనూరు వసంత(40), నిర్మల్‌ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి కమ్మరి ధర్మయ్య(55) మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని