GHMC: చక్కని మొక్కే.. పెరిగితే చిక్కే: కోనోకార్పస్ ఎరెక్టస్పై జీహెచ్ఎంసీ పునరాలోచన
అందంగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు కోనోకార్పస్ ఎరెక్టస్. విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలు అనతికాలంలోనే దేశమంతా విస్తరించాయి. ఈ మొక్క సులభంగా నాటుకుంటుంది. వేగంగా పెరుగుతుంది. గుబురుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్లే
అందంగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు కోనోకార్పస్ ఎరెక్టస్. విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలు అనతికాలంలోనే దేశమంతా విస్తరించాయి. ఈ మొక్క సులభంగా నాటుకుంటుంది. వేగంగా పెరుగుతుంది. గుబురుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్లే అందరికీ మక్కువ. కానీ వీటితో దుష్ప్రభావాలూ ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతుండటంతో అంతా పునరాలోచనలో పడ్డారు.దుబాయ్‌లో దీనిపై ఆందోళన మొదలైంది. గోడలను, పైపులైన్లను ధ్వంసం చేస్తోన్న వేరు వ్యవస్థను భరించలేక.. అక్కడ ఆ మొక్కలను వేళ్లతో పీకేశారు. ఈ చెట్టు పూల నుంచి వెలువడే రేణువులు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు హెచ్చరించడంతో పుణె నగరపాలక సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని స్థానిక సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఈ మొక్క వేళ్లు భూమిలోకి బాగా విస్తరించి పైపులైన్లను, ఇళ్ల పునాదులను దెబ్బతీస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన పలువురు ఆర్కిటెక్టులు సైతం అభిప్రాయపడటంతో వీటిని దూరం పెట్టాలని జీహెచ్ఎంసీ ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు నాటిన మొక్కల సంగతి అటుంచి.. కొత్తగా ఈ మొక్కను జనావాసాల్లో నాటొద్దని అంతర్గతంగా ఓ నిర్ణయానికొచ్చారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేపట్టి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ