Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

నైరుతి రుతుపవనాలు గురువారానికల్లా బంగాళాఖాతం తూర్పు ప్రాంతంలోకి విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది.

Updated : 18 May 2022 09:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు గురువారానికల్లా బంగాళాఖాతం తూర్పు ప్రాంతంలోకి విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని