హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌కు త్వరలో నూతన కాన్సుల్‌ జనరల్‌

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 2019, ఆగస్టు నుంచి కాన్సుల్‌ జనరల్‌గా పని చేస్తున్నారు.

Published : 19 May 2022 05:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 2019, ఆగస్టు నుంచి కాన్సుల్‌ జనరల్‌గా పని చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో నా ఉద్యోగ కాలపరిమితి త్వరలో తీరనుంది’ అని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు వివిధ వీసాలను జారీ చేయడంతోపాటు పెట్టుబడులు తదితరాలను హైదరాబాద్‌ కాన్సులేట్‌ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెలలో ఆయన పదవీవిరమణ చేయనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో నూతన కాన్సుల్‌ జనరల్‌ రానుండగా.. ఎవరు నియమితులవుతారు అన్న అంశం వెల్లడి కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని