అవగాహనతోనే అంధత్వానికి అడ్డుకట్ట

అంధత్వాన్ని నివారించేందుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ(ఎల్వీపీఈఐ)లో ఎల్వీపీఈఐ-అనంత్‌ బజాజ్‌ రెటీనా కేంద్రాన్ని ఊటీలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూమ్‌ ద్వారా పాల్గొని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

Published : 19 May 2022 05:23 IST

ఎల్వీపీఈఐ-అనంత్‌ బజాజ్‌ రెటీనా కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: అంధత్వాన్ని నివారించేందుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ(ఎల్వీపీఈఐ)లో ఎల్వీపీఈఐ-అనంత్‌ బజాజ్‌ రెటీనా కేంద్రాన్ని ఊటీలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూమ్‌ ద్వారా పాల్గొని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేత్ర సంరక్షణ, కంటి చూపు విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం గ్రామీణ, మండల స్థాయిలో శాటిలైట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా నేత్ర సంరక్షణకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్‌ఆర్‌ (సామాజిక బాధ్యత)లో భాగంగా కార్పొరేట్‌ సంస్థలు కేటాయించే నిధులను ఆరోగ్య రంగానికి కేటాయించి గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ.. ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్వీపీఈఐ సీనియర్‌ నాయకత్వ బృందం వ్యవస్థాపకులు గుళ్లపల్లి ఎన్‌ రావు, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ సీఎండీ శేఖర్‌ బజాజ్‌, ఎల్వీపీఈఐ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌, అనంత్‌ బజాజ్‌ రెటీనా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజా నారాయణన్‌, మధుర్‌ బజాజ్‌, పూజా బజాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని